నీ మెదడులో అసలేం లేదు అని చాలా మంది తిడుతుంటారు. కానీ మెదడులో ఏమీ లేకపోవడం వల్ల ఎన్నీ లాభాలున్నాయని మీకు తెలుసా? ఆల్రెడీ పూర్తిగా నిండిపోయిన వాళ్లకంటే, అప్పుడప్పుడే నిండుతున్న వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదెలాగో ఈ కథ ద్వారా తెలుసుకుందాం.
ఎవరైనా ఒక పనిలో మాస్టర్ కావాలంటే తమ మెదడు ఖాళీగా ఉంచుకోవాలి. లేదంటే, మాస్టర్ కాదు కదా కనీసం వర్కర్ కూడా కాలేరు. దాని గురించి తెలిపే కథ మీకోసమే.
సుజుకి రోషి యూట్యూబ్ లో వినిపించిన ఈ కథ మీ అందరికోసం.
ఒక ఊరిలో ఒక ముసలాయన ఉండేవాడు. ఆయనకి కొత్తగా ఏదైనా విద్య నేర్చుకోవాలని ఉండేది. ముసలితనం వల్ల ఎవ్వరి దగ్గరికి వెళ్ళి అడగాలని ఉండేది కాదు. కానీ, ఊరికే ఇంట్లో కూర్చోవడం వల్ల బోర్ ఫీలయ్యేవాడు. ప్రతీరోజూ ఇలానే ఫీల్ అవుతూ ఉంటే, ఒకనాడు అటుగా వెళ్తున్న వ్యక్తి వచ్చి, ఏమైంది తాతా అలా కూర్చున్నావు అని అడిగాడు. దానికి ఏం లేదు. ఇంటి దగ్గరా కూర్చుంటే ఏమీ పాలుపోవట్లేదు. ఏదైనా పనుంటే చూడు అని అడిగాడు.
అప్పుడు ఆ యువకుడు, ఈ వయసులో ఏం పని చేస్తావు తాతా, హాయిగా ఇంటి దగ్గర కూర్చుంటే సరిపోదా అన్నాడు. దానికి అలా కాదు, కూర్చుని కూర్చుని పిచ్చిలేసేలా ఉంది. ఏదైనా పనుంటే చూడు అన్నాడు. అప్పుడు ఆ యువకుడు, తమ దుకాణంలో పనికి రమ్మని చెప్పాడు.
ఆ దుకాణంలోకి వచ్చిన తాత, కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. కానీ పనిలో మెళకువలు చెప్తే మాత్రం ఇబ్బంది పడుతున్నాడు. అన్నీ నాకు తెలుసని చెబుతున్నాడు. ఇలా కొన్ని రోజులయ్యే సరికి తాత కంటే ముందుగా చేరినవాళ్ళు తమ పనిలో నిష్ణాతులైపోయారు. కానీ తాత మాత్రం ఇంకా మొదటి స్టేజిలోనే ఉన్నాడు.
ఈ విషయంలో మధనపడుతున్న తాత, ఒక టీ కొట్టు వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక పనిలో మాస్టర్ అవ్వాలంటే ఏం చేయాలని అడిగాడు. దానికి టీ కొట్టు యజమాని, ఒక గ్లాసులో టీ పోస్తూ, అది నిండిపోయాక కూడా పోస్తూనే ఉన్నాడు. అపుడు అలా ఎందుకు పోస్తున్నావ్ అని అడిగితే, నీ మెదడు ఖాళీగా ఉంటే, దాన్లో ఎంతయినా చేరుతుంది. నీ మెదడు ఫుల్ గా ఉంటే, ఎంత చెప్పినా, అది మెదడులోకి ఎక్కదు అన్నాడు.