భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఒక ఇంటి వాడయ్యాడు. కొన్నేళ్లుగా తాను ప్రేమిస్తున్న సినీనటి ఆతియా శెట్టిని సోమవారం వివాహమాడాడు. మహారాష్ట్రలోని ఖండాలాలో అతియ తండ్రి బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో వీరి పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రాహుల్, ఆతియా ఒక్కటయ్యారు.
పెళ్లి అనంతరం ఈ జంట బయట వేచి చూస్తున్న వీడియో ప్రతినిధుల ముందుకు వచ్చి ఫోటోలకు ఫోజులిచ్చింది. తమ పెళ్లి ఫోటోలను రాహుల్ అతియ సామాజిక మాధ్యమాల్లోనూ పంచుకున్నారు. “అతియ వెలుగులో నేను ప్రేమించడం నేర్చుకున్నా. ఈరోజు అత్యంత ఇష్టమైన వ్యక్తుల మధ్య మా ఇంట్లో మేము పెళ్లి జరగడం చాలా ఆనందంగా ఉంది. ” అంటూ కేఎల్ రాహుల్ ట్వీట్ చేశారు. కాగా వీరిద్దరి వివాహానికి ఏకంగా 3000 మంది అతిథులు వచ్చారు.