భారత క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ నవ్‌జ్యోత్ సిద్ధూ ప్రశంసల జల్లు కురిపించారు.రాహుల్‌ను వాహన ‘స్పేర్ టైర్’తో పోల్చుతూ… అత్యవసర పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ ఎలా అయినా జట్టుకి అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు. రాహుల్ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో ఎవరూ లేరని సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు.
ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ ,గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ నేపథ్యంలో నవ్‌జ్యోత్ సిద్ధూ ఈ వ్యాఖ్యలు చేశారు.స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన చర్చలో నవ్‌జ్యోత్ సిద్ధూ మాట్లాడుతూ… ‘కేఎల్ రాహుల్ ఎన్నో ప్రశంసలకు అర్హుడు. రాహుల్ వికెట్ కీపర్‌గా లేదా ఓపెనర్‌గా కూడా ఆడతాడు.అతడు మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. జట్టులోని ఏ పాత్రనైనా పోషించగడు. జీప్ వెనుక ఎప్పుడూ ఒక టైర్ ఉంటుంది. అదే స్పేర్ టైర్. అత్యవసర పరిస్థితి లేదా పంక్చర్ అయినపుడు ఆ స్పేర్ టైర్‌ను వాడుకుంటాం. అలాగే కేఎల్ రాహుల్ ఆ స్పేర్ టైర్ లాంటోడు. అందరికీ ఆ సామర్థ్యం ఉండదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.