శృంగారం లో సృజనాత్మకత.. ఆనంద తీరాలను చేరాలంటే ఆమాత్రం కావాల్సిందే.

-

ఇద్దరు భాగస్వాములు తమ రతిక్రీడలో హద్దులు దాటి అంతులేని శిఖరాలను చేరుకోవాలంటే ఆ ఇద్దరికీ కొంచెం సృజనాత్మకత తెలిసి ఉండాలి. అలాంటప్పుడే పడక సుఖంలో పర్వతాలను అధిరోహించగలరు. శృంగారం అంటే పచ్చిబూతు అని నమ్మే ఏ భాగస్వాములు కూడా అందులోని ఆనందాలను ఎప్పటికీ అనుభవించలేరు. ఇరువురి ఆలోచనల్లో ఉడుకు పుట్టి, అక్కడ నుండి అది శరీరాలకు పాకి, ఒకరి నొకరు కలుసుకోవాలన్న వాంఛ తీవ్రమై స్పర్శ కొరకు కోరిక పెరిగి, చెయ్యి తగలగానే తీగలు ప్రవహించినట్టు నరాలు జివ్వుమని ఆపై ఇక తాళలేక కలుసుకున్న రెండు శరీరాలు శృంగారంలోని ఆనంద తీరాలను సులువుగా చేరుకుంటారు.

ప్రతీ ఒక్కరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం శృంగారంలో సృజనాత్మకత ఎలా ఉంటుందనేది ఇక్కడ చూద్దాం.

ముద్దుతో మొదలు

మీరిద్దరు దగ్గరకు చేరుకున్నాక అవతలి వారి శ్వాస మీ మీద పడి మీ శ్వాస వాది మీద పడ్డప్పుడు, నిశ్శబ్దం తప్ప మరేది లేనపుడు ముద్దు పెట్టండి. ముందు మెల్లగా మొదలై ఆ తర్వాత ముద్దులోని మత్తంతా శరీరాలకు ఎక్కేలా ముద్దు పెట్టండి.

మాట్లాడండి

శృంగారంలో మీ చర్యలే కాదు మాటలకు ప్రాధాన్యం ఉంటుంది. అవతలి వారి గురించి మాట్లాడండి. ఆ మాటలు వారిలో కోరికను మరింతగా పెంచేలా ఉండాలి.

గుసగుసలు

గుసగుసలు గమ్మత్తుగా ఉంటాయి. చెవి దగ్గర పెట్టే గుసగుసలు మీ భాగస్వామిలో కోరికను ద్విగుణీకృతం చేస్తాయి.

వివరాలు చెప్పండి

శరీర భాగాల గురించిన వివరణ చాలా మందికి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. నీ నడుము చాలా బాగుంది. ఇక్కడ ఈ మడత భలేగా ఉంది అన్న మాటలు శృంగారంలో పెద్ద పాత్ర వహిస్తాయి. అవతలి వారు కూడా ఆ భాగాలతో మిమ్మల్ని ఉద్రేక పర్చడానికి సమాయత్తమవుతారు.

మూలుగులు

చిన్న చిన్న మూలుగులు మీ భాగస్వామిలో శృంగార కాంక్షని మరింత పెంచేలా చేస్తాయి. మీ చర్యకు అవతలి వారి నుండి మూలుగుల ద్వారా ప్రతిస్పందన రావడంతో చర్యలను మరింత ఉధృతం చేస్తారు.

కళ్ళు పైకెత్తండి

కొన్ని సార్లు శరీరం మీద శ్రద్ధ పెట్టినపుడు అవతలి వారిని తక్కువగా చూస్తుంటారు. కానీ మీ కళ్ళను పైకెత్తండి. అప్పుడు మీ భాగస్వామిలో కోరిక మరింత పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version