ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO ఉద్యోగులకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవకాశాన్ని కల్పిస్తుంది. ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు పిఎఫ్ బ్యాలెన్స్ ని అవసరం అయినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ పిల్లల పెళ్లిళ్లు లేదా పిల్లల చదువుల కోసం, హోమ్ లోన్స్, ఇల్లు కొనుగోలు చేయడం లేదా భూమిని కొనుగోలు చేయడం.. ఇలా వివిధ కారణాలు వలన డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే మీ బ్యాలెన్స్ ఎంతుందో చూడడం కోసం మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. క్షణాల్లో తెలుసుకోవచ్చు.
అయితే EPF బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం..! మీరు పిఎఫ్ బాలెన్స్ తెలుసుకోవాలంటే ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదా ఇప్పుడు ఈపీఎఫ్ ఈపీఎఫ్ పోర్టల్ లో కానీ UMANG లో కూడా చూసుకోవచ్చు. అయితే sms మరియు మిస్డ్ కాల్ ద్వారా ఎలా చెక్చే సుకోవాలో చూద్దాం..!
మీ UAN కేవైసీ తో లింక్ అయి ఉంటే మీరు సులువుగా టెక్స్ట్ చేయొచ్చు. దీంతో మీ పీఎఫ్ బ్యాలెన్స్ మీరు తెలుసుకోవచ్చు. దీనికోసం మీరు EPFOHO UAN ENG అని టైప్ చేసి పంపాలి ఇక్కడ ఉన్న లాస్ట్ మూడు అక్షరాలు భాష.
7738299899 నెంబర్ కి మీరు మెసేజ్ పెడితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ ని వాళ్ళు చెప్తారు.
మిస్డ్ కాల్: కేవైసీ తో మీరు ఏం అనుసంధానమై ఉంటే మీరు సులువుగా టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయొచ్చు. 01122901406 కి మీరు మిస్డ్ కాల్ ఇచ్చి బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఒకసారి నెంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే మీకు బ్యాలెన్స్ అమౌంట్ మెసేజ్ వస్తుంది.