డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నటుడికి కరోనా పాజిటివ్

-

బాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా.. ప్రముఖ నటుడు.. హిందీ బిగ్‏బాస్ సీజన్ 7 కంటెస్టెంట్, తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన ఎజాజ్ ఖాన్‏ను అరెస్ట్ చేశారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు. ఎజాజ్ ఖాన్.. తెలుగులో రక్త చరిత్ర, నాయక్ వంటి సినిమాల్లో విలన్‏గా నటించాడు. రాజస్థాన్ నుంచి ముంబై వస్తున్న క్రమంలో ఎయిర్ పోర్టులోనే ఎజాన్ ను అదుపులోకి తీసుకున్నారు ముంబై పోలీసులు.

అయితే తాజగా అతనికి కరోనా అని తేలింది. మాదకద్రవ్యాల కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన నటుడు అజాజ్ ఖాన్ కి కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ దర్యాప్తులో పాల్గొన్న అధికారి కూడా కోవిడ్ పరీక్ష చేయనున్నారు. ఎజాజ్ ఖాన్‏ను అరెస్ట్ చేయడం ఇదే మొదటి సరి కాదు. 2018లో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధిత మాదకద్రవ్యాలను కలిగి ఉన్నాడనే ఆరోపణలతో అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2020 ఏప్రిల్ నెలలో ఫేస్ బుక్ లో అభ్యంతరకరమైన పోస్ట్ చేసినందుకుగానూ అతన్ని మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version