నారా భువ‌నేశ్వ‌రికి కొడాలి నాని కౌంట‌ర్‌..వాళ్లే సంక‌నాకి పోతారు !

-

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని త‌న స్టైల్ లో స్పందించారు. నిజంగా నారా భువనేశ్వరిని కించపరిచినట్లు మాట్లాడినవారు వాళ్ల పాపాన వాళ్లే పోతారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కొడాలి నాని. చేయకుండా చేశామని చెప్పినోళ్లు కూడా సంకనాకి పోతారన్నారు. మహిళలను కించపరిచిన చంద్రబాబు ఎంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాడో ఇప్పుడు చూస్తున్నామ‌న్నారు కొడాలి నాని.

పెళ్ళాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే సన్నాసి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రారంభించింది రాజశేఖరరెడ్డి అని.. చంద్రబాబు చెప్పే మాటల పై చర్చకు నేను సిద్ధం…ఛాలెంజ్ చేస్తున్నాన‌ని పేర్కొన్నారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాన‌ని స‌వాల్ విసిరారు. చంద్రబాబు ఓటీఎస్ లాంటి కార్యక్రమాన్ని జీవితంలో చేయలేడని ఫైర్ అయ్యారు.

ఈ కార్యక్రమం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేక వస్తుంది అనుకుంటే చంద్రబాబు అండ్ టీం ఆనందంగా ఉండే వాళ్ళు అని.. ఇప్పటి వరకు 8 లక్షల మంది పేద వారు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారని గుర్తు చేశారు. ఈ పథకాన్ని అర్హులైన వాళ్ళందరూ ఉపయోగించుకోవాలని… ఇన్నేళ్ళు హెరిటేజ్ తో పేదవాళ్ళను లూటీ చేశారని మండిప‌డ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version