పవన్ ఎవరితో వచ్చినా మాకు పోయేది ఏం లేదు : కొడాలి నాని

-

ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఇటీవల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే.. తాజాగా పవన్‌ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. ‘‘పవన్ ఎవరితో వచ్చినా మాకు పోయేది ఏం లేదు. 2019లో వచ్చిన ఫలితమే పునరావృతం అవుతుంది. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్.. సీఎం గురించి మాట్లాడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు కొడాలి నాని. లోకేష్‌ పాదయాత్ర చేసి మరొకరిని గెలిపిస్తారా? అని ప్రశ్నించారు కొడాలి నాని. రావి వెంకటేశ్వరరావు తన వ్యాఖ్యలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ విసిరారు కొడాలి నాని. ఇదిలా ఉంటే.. అమరావతి అంశంలో ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై నేడు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వికేంద్రీకరణకు బలాన్నిస్తున్నాయని తెలిపారు.

రాజధానిని 3 నెలలు లేదా 6 నెలల్లోనే నిర్మించాల్సిన అవసరం లేదని అంబటి స్పష్టం చేశారు. రాజధానుల నిర్ణయంలో న్యాయస్థానాల జోక్యం సరైంది కాదని దీన్ని బట్టి అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు . ఇక అమరావతి యాత్రకు శాశ్వత విరామం ఇచ్చినట్టేనని పేర్కొన్నారు. గ్రాఫిక్స్ చూపించారు తప్ప అమరావతిలో నిర్మాణాలు చేయలేదని విమర్శించారు. రైతుల వేషాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నారని ఆరోపించారు. అమరావతి ప్రాంతంలోని నిజమైన రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అయినా, రాజధానులకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను చంద్రబాబు ఆపాలని అంబటి హితవు పలికారు. ఇక, జనసేనాని పవన్ కల్యాణ్ పైనా అంబటి విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఒక పెద్ద జోకర్ అని అభివర్ణించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version