టీడీపీ నేతల కలల్లో కొడాలి నాని!!

-

పగటి పూట అసెంబ్లీలో కునుకుతీసే అలవాటు సంగతి కాసేపు పక్కన పెడితే… టీడీపీ నేతలకు గత కొంతకాలంగా ఏపీ మంత్రి కొడాలి నాని కలలోకి వస్తున్నారనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా వినిపిస్తున్నాయి! తాజాగా టీడీపీ నేతలు, వారి అనుంగ బ్యాచ్ చేసే కామెంట్లు చూస్తుంటే అలానే అనిపించకమానదు!

కొడాలి నాని మనిషే కాదు అన్న స్థాయిలో మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు! వైఎస్ జగన్ పై ఈగ వాలనియ్యకుండా జాగ్రత్తలు తీసుకుని, అవసరమైతే తాను అడ్డంగా నిలబడి, టీడీపీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోన్న కొడాలి నాని… టీడీపీ నేతలకు పగలూ రాత్రి తేడా లేకుండా కలలోకి వచ్చేస్తున్నారంట!

జగన్ కంటే ఎక్కువగా చంద్రబాబు, టీడీపీ నేతల గురించి కొడాలి నానికి మరింత బాగా తెలుసు! కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి నాని! కాబట్టి నాని ఏమి మాట్లాడినా… లోపల ఎక్కడో ఆత్మారాముడు గద్దించడం వల్లో ఏమో కానీ.. నాని ఎంత గర్జించినా టీడీపీ నేతలౌ మాట్లాడరు. అది అసెంబ్లీ లోపల అయినా.. బయట అయినా! అయితే తాజాగా మోడీపై కొడాలి నాని చేసిన కామెంట్లపై మాత్రం పీకేసుకుంటున్నారు టీడీపీ నేతలు!

ప్రస్తుతం గత్యంతరం లేకుండా ఉన్న టీడీపీ, బీజేపీ పంచన చేరడానికి చేస్తోన్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు! ఈ క్రమంలో మోడీని ఏమైనా అంటే… ఏపీ బీజేపీ కంటే తామే ఎక్కూవగా స్పందింఛామనే ప్రయత్నలు బలంగా చేస్తున్నారు టీడీపీ నేతలు. అందులో భాగంగా ఏకంగా ఏపీ మంత్రి కొడాలి నానిని… మనిషే కాదు అన్న రేంజ్ లో మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు!

దీంతో… పగలు రాత్రి కూడా కొడాలి నాని టీడీపీ నేతల కలలోకి వస్తున్నట్లున్నారని కామెంట్లు చేస్తున్నారు కొడాలి నాని అభిమానులు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version