కొడాలి నాని నోటి వాక్కు ఫలిస్తుందా… 2024 లో టీడీపీకి 4 సీట్లే గతా ?

-

ఏపీలో ఇటీవల ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మరియు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ విజయం సాధించిందో లేదో దాని ఆసరాగా తీసుకునే ఏకంగా వచ్చే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రానుంది అన్నంత రాద్ధాంతం చేస్తున్నారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు మద్దతుదారులు. ఇక తాజాగా మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిపక్ష టీడీపీ గురించి జోస్యం చెప్పాడు. నాని చెబుతున్న ప్రకారం టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా వచ్చేలా లేదు. ఏకంగా టీడీపీ కేవలం నాలుగు చోట్ల మాత్రమే గెలుస్తుందని చెబుతున్నాడు.

గతంలో 2014 లో టీడీపీ అధికారంలో ఉండగా మంది ఎమ్మెల్యే లను చంద్రబాబు కొనుగోలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ పాపానికి పరిహారంగా 2019 లో కేవలం 23 చోట్లకు పరిమితం అయ్యారు. ఇక తాజాగా నాలుగు వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే గెలుస్తారు అంటూ లెక్కలు చెప్పారు. మరి కొడాలి నాని నోటి మాట ఫలిస్తుందా ?

Read more RELATED
Recommended to you

Exit mobile version