టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో ఘనతలు సాధించాడు. అండర్ 19 ప్రపంచకప్ లో విజయం నుంచి ప్రతీ ఒక్కటి కూడా అతని కెరీర్ లో ఎన్నో విజయాలు సాధించాడు. అతని కెరీర్ లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆట వరకు వాటిని రానీయలేదు. ప్రేమ అయినా మరొకటి అయినా సరే. ఇదిలా ఉంటే తన కెరీర్ లో అత్యంత క్లిష్ట పరిస్థితి గురించి కోహ్లీ వెల్లడించాడు.
“నేను మొదట్లో రాష్ట్ర జట్టుకు ఎంపిక కానప్పుడు నా కోసం నేను ఏమీ పని చేయలేదని భావించా. రాత్రంతా అరిచా… నా కోచ్‌ను ‘నేను ఎందుకు ఎంపిక కాలేదు’ అని అడిగానని అతను వివరించాడు. తన భార్య అనుష్క శర్మతో కలిసి నిర్వహించిన ఆన్‌లైన్ క్లాస్‌లో మాట్లాడుతూ కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేసాడు. తమ జీవితంలో వాళ్ళు ఇద్దరు ఎదుర్కొన్న సమస్యలను వాళ్ళు ఈ సందర్భంగా వివరించారు.
కరోనా గురించి మాట్లాడుతూ ఈ సంక్షోభం గురించి మన దేశం పాజిటివ్ గా ఉందని అన్నాడు. పోలీసు సిబ్బంది, వైద్యులు లేదా నర్సులకు, ఈ యుద్ధంలో ఫ్రంట్‌లైన్ కార్మికులకు మేము మరింత కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పాడు. మహమ్మారి ప్రపంచానికి చాలా ముఖ్యమైన పాఠం నేర్పించిందని కోహ్లీ అన్నాడు. “జీవితం అనూహ్యమైనది. కాబట్టి, మీకు సంతోషాన్ని కలిగించేది చేయండన్నాడు కోహ్లీ.