కోల్ కతా వైద్యురాలి అత్యాచారం కేసు.. కోర్టు తీర్పు పై సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి

-

కోల్ కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై లైంగిక దాడి చేసి హత్య చేసిన విషయం విధితమే. ఈ ఘటన పై తాజాగా సీల్దా కోర్డు దోషీ సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు విధించింది. అయితే ఈ తీర్పు పై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేసింది. . అందరం నిందితుడికి ఉరిశిక్ష
పడుతుందని భావించామని తెలిపారు. కానీ కోర్టు జీవిత ఖైదు విధించిందని అన్నారు. ఈ కేసును
కోల్కతా పోలీసుల నుంచి బలవంతంగా సీబీఐకి బదిలీ చేశారని వెల్లడించారు. ఒకవేళ కోల్ కతా పోలీసుల  చేతుల్లోనే ఉంటే వారు దోషికి మరణశిక్ష పడేలా వందశాతం ప్రయత్నించే వారని అన్నారు.

ఇదిలా ఉండగా.. సీల్దా కోర్టు తీర్పుపై కోల్కతా విద్యార్థులు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగ సీల్దా కోర్టు ఎదుట విద్యార్థుల నిరసన వ్యక్తం చేశారు. నిందితుడికి ఉరి శిక్ష విధించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని.. కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని స్టూడెంట్స్ సంచలన ప్రకటన చేశారు.  కోర్టు తీర్పులో దోషికి జీవితఖైదు విధించడంతో పాటు బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటన అరుదైన కేసు కేటగిరీలోకి రాదని వ్యాఖ్యానించింది. మరణశిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని తెలిపింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version