కోల్‌కతా మెడికో రేప్ అండ్ మర్డర్.. దేశవ్యాప్తంగా నిరాహార దీక్షకు IMA పిలుపు

-

కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు గత 10 రోజులుగా నిరాహార దీక్షకు దిగారు. దీంతో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్‌ పంత్, 12 డాక్టర్ల సంఘాలకు మధ్య సోమవారం చర్చలు జరిగాయి. బెంగాల్ ప్రభుత్వానికి, డాక్టర్లకు జరిగిన చర్చలు విఫలమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా నిరాహార దీక్ష చేపట్టేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పిలుపునిచ్చింది.

మంగళవారం దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల దగ్గర 12 గంటల నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉదయం 6 గంటలకు దీక్ష ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. డాక్టర్ల డిమాండ్‌ మేరకు కోల్‌కతా సీపీ, మరికొందరు వైద్యశాఖ ఉన్నతాధికారులపై బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ మిగతా డిమాండ్లను తీర్చేందుకు సిద్ధంగా లేదని డాక్టర్లు తెలిపారు. ‘నిరాహారదీక్ష చేస్తున్న యువ డాక్టర్లతో చర్చలకు ఉన్నతాధికారులను పంపాలని ప్రభుత్వాన్ని కోరాం.సమస్య పరిష్కారంపై టైం గడువు చెప్పలేమని సీఎస్ మనోజ్‌ పంత్‌ సూచనప్రాయంగా తెలిపారు’ అని భేటీలో పాల్గొన్న వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news