8కి.మీ డోలీలో మోసుకుంటూ వెళ్లినా చివరకు దక్కని ప్రాణాలు

-

ఏపీలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు సౌకర్యం, ఆస్పత్రులు అందుబాటులో లేకపోవడంతో కిలోమీటర్లు నడకదారిలో వెళ్లినా ప్రాణాలు నిలబడటం లేదు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా పింజరికొండ ఘటన మరువక ముందే మరో గిరిజనుడు సకాలంలో వైద్యం అందక మృతి చెందాడు.

సోమవారం మారేడుమిల్లి మండలంలోని సున్నంపాడు పంచాయతీ నూరుపూడికి చెందిన కేచ్చల తమ్మిరెడ్డికి తీవ్ర కడుపు నొప్పి వచ్చింది. వెంటనే అతన్ని డోలీ సాయంతో 8 కిలోమీటర్లు గ్రామస్తుల సాయంతో కుటుంబ సభ్యులు మోసుకొచ్చారు. రోడ్డు సౌకరం లేకపోవడం, కొండవాగును దాటుకుంటూ వెళ్లాలి. అంబులెన్స్ వచ్చే వీలు లేకపోవడంతో సుమారు 8 కిలోమీటర్లు డోలీ పైనే గ్రామస్తులు మోసుకొచ్చినా కడుపునొప్పి తీవ్రతరం కావడంతో తమ్మిరెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఇప్పటికైనా ఏజెన్సీలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని సున్నంపాడు పంచాయతీ గిరిజనులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news