మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు 14 రోజులు రిమాండ్‌..!

-

వైసీపీ నేత మోకా భాస్కర్‌ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. నిన్న కొల్లు రవీంద్రను అరెస్టు చేసిన పోలీసులు ఈరోజు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు విన్న రెండో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్‌ విధించారు.

 

కాగా అంతకు ముందు కృష్ణా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, మోకా హత్య ప్లానింగ్‌‌ లో రవీంద్ర భాగస్వామేనని తెలిపారు. మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉన్నట్టు భాస్కర్ రావు కుటుంబసభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొల్లు రవీంద్ర ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి వెళ్లారు. తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద పోలీసులు శుక్రవారం కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version