రవాణాశాఖ మంత్రి పేర్ని నాని అనుచరుడైన భాస్కర్ రావు హత్య కేసులో విచారణ నిమిత్తం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. రవీంద్ర కోసం పోలీసులు ఆయన ఇంటిని రెండు సార్లు గాలించగా.. ఆయన సెల్ ఫోన్ మాత్రమే లభ్యమైంది. ఆయన కోసం అన్నిచోట్లా గాలించారు. అయిన్పటికీ.. కొల్లు రవీంద్ర ఆచూకీ తెలియరాలేదని అంటున్నారు. దీంతో కొల్లు రవీంద్ర అజ్ఙాతంలోకి వెళ్లినట్లు భావిస్తున్నారు.
దీనితో ఆయన కోసం ఆరా తీయడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న చింతా నాంచారయ్య అలియాస్ చిన్నిని పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు. ఆయనను విచారించగా.. కొల్లు రవీంద్ర పేరు వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. చిన్ని ఇచ్చిన వివరణ ఆధారంగా కొల్లు రవీంద్ర పేరును పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. హత్య అనంతరం చింతా చిన్ని కొంతమంది టీడీపీ నాయకులతో ఫోన్‌లో సంభాషించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో కొల్లు రవీంద్ర పేరు లేదని తేలింది.