బిగ్ బ్రేకింగ్ : మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్..!

-

రవాణాశాఖ మంత్రి పేర్ని నాని అనుచరుడైన భాస్కర్ రావు హత్య కేసులో విచారణ నిమిత్తం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో కొల్లు రవీంద్ర అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఉదయం నుంచి పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. తాజాగా అరెస్టు చేశారు.  తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం వద్ద ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ వెళ్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన్ను వాహనంలో విజయవాడ తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version