మళ్లీ పెళ్లి చూపులంటోన్న కోలీవుడ్ హీరో

-

నెల్లూరు కుర్రాడు కోలీవుడ్ హీరో విశాల్ కు పెద్ద షాక్ తగిలింది. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వినిపిస్తున్న అతడి మ్యారీజ్ మ్యాటర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది కోలీవుడ్ అయింది.అందరు అనుకుంటున్న అనీశారెడ్డితో మ్యారీజ్ కాన్సెప్ట్ బ్రేక్ అప్ అయిపోయింది. దీంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లైఫ్ లోకి వచ్చే కొత్త గాళ్ ఎవరా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

విశాల్ మ్యారీజ్ మ్యాటర్ గత పదేళ్లుగా వినిపిస్తూనే ఉంది.కెరియర్ ప్రారంభం నుంచి మనోడు హీరోయిన్లతో కాస్త ఎక్కువగానే మూవ్ అయినప్పటికీ మ్యారీజ్ కు లాక్ మాత్రం వేయలేకపోయాడు.అప్పట్లో కోలీవుడ్ బ్యూటీస్ పేర్లు బాగానే వినిపించినప్పటికీ అది వెంటనే బ్రేక్ అప్ అయిపోయింది. ఆతర్వాతనే వరలక్షితో వ్యవహారం నడిపి టాక్ ఆఫ్ ది సౌత్ సినిమా అయ్యాడు.

వరలక్ష్మితో మ్యారీజ్ వరకు వెళ్లిన విశాల్ ఆ తర్వాత జస్ట్ ఫ్రెండ్స్ అంటూ డిస్టన్స్ మెయిన్ టైన్ చేశారు.కరెక్ట్ గా అదే టైమ్ లో అర్జున్ రెడ్డిలో హీరో-హీరోయిన్ సర్కిల్లో క్లోజ్ గా మూవ్ అయిన అనీశారెడ్డికి క్లోజ్ అయ్యాడు.అవ్వడమే కాదు ఏకంగా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఎంగేజ్మెంట్ జరిగిన కొంత కాలానికి ఆ ఈవెంట్ ఫొటోలన్నింటినీ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి అనీశా తొలగించేయడంతో ఇద్దరి మధ్య ఏదో జరిగిందని అర్థమైంది.

అనీశాతో ఎంగేజ్ మెంట్ కు ముందు శ్రీదివ్యతోను సినిమా నడిపించిన విశాల్ ..ఆతర్వాత ఆమెతో అంత క్లోజ్ కాలేదు.తాజాగా అనీశా,విశాల్ విడిపోయిన విషయం అధికారికంగా కన్ఫామ్ అయింది. అనీశా పెళ్లి వేరే వ్యక్తితో జరిగిపోయింది.హైదరాబాద్‌కే చెందిన ఓ వ్యాపార వేత్తతో అనీశా పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి విశాల్‌ నుంచి అనీశా ఎప్పుడో విడిపోయి మూవ్ ఆన్ అయిపోయిందని స్పష్టమవుతోంది. మరి వీరి మధ్య ఎందుకు విభేదాలొచ్చాయన్నది తెలియదు. 43ఏళ్ల విశాల్ కు ఇప్పుడు మ్యారీజ్ పెద్ద ప్రెస్టీజ్ మ్యాటర్ అయిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version