రైతులకి కోమటి రెడ్డి గుడ్ న్యూస్..!

-

గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురిసిన ఆకాల వర్షాల వలన రైతులకి నష్టాలు కలిగాయి వడగళ్ల వానకి పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఈ క్రమం లో పంట నష్టపోయిన రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభవార్త చెప్పారు. పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అలానే ధాన్యానికి మద్దతు ధర చెల్లించుకుంటే రైస్ మిల్లులని సీజ్ చేస్తామని హెచ్చరించారు.

స్థానిక ఎమ్మెల్యేలు అధికారులు చెప్పిన తీరుమారని మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే రైతుల నుండి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని చెప్పారు. రాష్ట్రంలో రైతాంగానికి అన్యాయం జరిగితే సహించము అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ దగ్గర మోకరిల్లి కృష్ణ గోదావరి జలాలని ఆంధ్రప్రదేశ్కి ధారాధత్వం చేసిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news