కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం లో వైసీపీకి దెబ్బ తగిలింది. తుని మాజీ మున్సిపల్ చైర్మన్ కూసుమంచి శోభారాణి వైసీపీకి రాజీనామా చేశారు. టిడిపిలో చేరారు. టిడిపి తీర్థం పుచ్చుకున్న శోభారాణికి తేటగుంట టిడిపి ఆఫీసులో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు టిడిపి అభ్యర్థి దివ్య పార్టీ కండువా కప్పి టీడీపీ లోకి ఇన్వైట్ చేశారు. రామకృష్ణుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ పై కామెంట్స్ చేశారు.
వైసీపీ విషపు సామ్రాజ్యం నుండి అందరూ బయటికి వస్తున్నారని అన్నారు సీఎం జగన్ సామాన్యుడు కాదని విషయంతో కూడుకున్న వ్యక్తి అని అన్నారు. కడపలో ఫ్యాక్షనిజన్ని ప్రారంభించిన జగన్ తాత రాజారెడ్డి అని అన్నారు. ప్రజలందరూ కూటమిని గెలిపించుకుంటే ప్రజాస్వామ్యం రక్షింపబడుతుందని అన్నారు.