మునుగోడు ఉప ఎన్నికపై పార్టీ ఏం ఆదేశిస్తే అది పాటిస్తా – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

-

కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే..తొలిసారి రాజ్ గోపాల్ రెడ్డి ఎపిసోడ్ లో స్పందించారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఈ మునుగోడు ఉప ఎన్నికపై పార్టీ ఏం ఆదేశిస్తే అది పాటిస్తానని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

అటు కాంగ్రెస్ పార్టీ అవ‌కాశాలు ఇవ్వ‌కుంటే… బ్రాందీ షాపుల్లో ప‌నిచేయ‌డానికి కూడా ప‌నికి రారంటూ రాజ‌గోపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై ఘాటుగా స్పందించారు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. త‌మ కుటుంబం బ్రాందీ వ్యాపారం చేస్తోందంటూ వ్యాఖ్య‌లు చేసిన రేవంత్ రెడ్డి త‌మ‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

పార్టీ మారిన స‌మ‌యంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారా? అని కూడా ప్ర‌శ్నించారు. త‌న వ్యాఖ్య‌ల‌తో రేవంత్ రెడ్డి త‌నను అనుమానిస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి త‌న‌ను అన‌వ‌స‌రంగా రెచ్చ‌గొట్టొద్ద‌ని హెచ్చ‌రించారు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version