భువనగిరి పట్టణంలోని గాంధీ పార్కులోని మహాత్మా గాం ధీ జన్మది నోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు భువనగిరి ఎంపీ కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ సందర్భంగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ ఆశయాల కోసం కృషి చేద్దామన్నారు. రాష్ట్రంలో 30 మంది వీఆర్ఏలు ఆత్మహత్య చేసుకున్నారు. పదివేల మంది ఉన్న వీఆర్ఏ సమస్యలను పరిష్కరించ లేకపోయారు.
100 కోట్లు పెట్టుకొని సొంతంగా ఫ్లైట్ కొనుక్కోవచ్చు. రెండు రోజుల్లో విఆర్ఏ ల సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా వీఆర్ఏల తమ సమస్యలు పరిష్కరించాలని మీ దగ్గరికి వస్తే ఎలా ప్రవర్తించాలో అందరూ చూశారు. వరంగల్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం.ఓ వీఆర్ఏ గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడన్నారు. వీఆర్ఏ సమస్యలను పరిష్కరించని వాళ్ళు, దేశం కోసం పార్టీ పెట్టి ఏం చేస్తారు ? తెలంగాణ మొత్తం బంగారం అయిందని, ఈరోజు భారతదేశాన్ని బాగు చేస్తానని బయలుదేరుతున్నారని ఆగ్రహించారు.