ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ..మునుగోడు ప్రజల కోసం ఇద్దరం ఒకేరకంగా ఆలోచిస్తామన్నారు. నా ఆలోచన, మా అన్నయ్య ఆలోచన ఒకటేనని, వెంకట్ రెడ్డి పార్టీ మార్పుపై పరోక్షంగా హింట్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు సమస్యలపై ఎన్నో సార్లు మాట్లాడానని తెలిపారు రాజగోపాల్ రెడ్డి. పత్రిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలను ప్రభుత్వం పట్టించుకోదని అన్నారు రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నిక వస్తేనే నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల చరిత్రలో నిలిచిపోతుందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాశక్తి గొప్పదని హుజురాబాద్‌లో ప్రజలు నిరూపించారు. నన్ను నమ్మి ఓటు వేసిన ప్రజలకు ఏం సమాధానం చెప్పాలన్నారు రాజగోపాల్ రెడ్డి.
ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ తీర్పు ద్వారా తెలంగాణ రాజకీయాలు మారిపోతాయని, నేను బాధతోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేశానన్నారు రాజగోపాల్ రెడ్డి. నాకు కాంగ్రెస్ అంటే ఇష్టమేనని, మునుగోడు ప్రజలపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందన్నారు రాజగోపాల్ రెడ్డి. మా దగ్గర అవినీతి సొమ్ము లేదని, ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తిని ముందు పెట్టాలని అధిష్టానాన్ని కోరామన్నారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్‌లో సరైన నాయకత్వం లేదని, నాయకత్వాన్ని లీడ్ చేసే వ్యక్తికి క్రెడబులిటీ, కెపాసిటీ ఉండాలన్నారు రాజగోపాల్ రెడ్డి.