టీడీపీ కేడ‌ర్ అవ‌స‌రం లేదంటున్న కోమ‌టిరెడ్డి.. రేవంత్‌కు ఝ‌ల‌క్‌..!

-

టీపీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఝలక్ ఇచ్చారు. రేవంత్‌కు అన్ని విధాలా మద్దతు ఇస్తానని పేర్కొంటూనే ఆయన తీరు మార్చుకోవాలని కామెంట్ చేశారు. ఇటీవల తాను రేవంత్‌తో భేటీ అయినట్లు వెంకట్‌రెడ్డి మీడియాకు తెలిపారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తానూ కృషి చేస్తానని చెప్పారు. అయితే, తనకు రేవంత్‌తో కలిసి పని చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ, టీడీపీ నేతలు, కేడర్ వెంట పడి వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాల్సిన అవసరం లేదని వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

అందుకు బదులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను విశ్వాసంలోకి తీసుకుని వారికి తగు గౌరవమివ్వాలని తాను రేవంత్‌కు సూచించానని వెంకట్‌రెడ్డి చెప్పారు. భువనగిరి ఎంపీగా తన పార్లమెంటరీ నియోజకవర్గంలోని ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. గతంలో వెంకట్‌రెడ్డి పీసీసీ చీఫ్ పదవిని కాంగ్రెస్ అధిష్టానం అమ్ముకుందని కామెంట్స్ చేసిన సంగతి అందరికీ విదితమే. ఇకపోతే తెలంగాణలో రాజీనామా చేయాలని ప్రజలు సోషల్ మీడియా వేదికగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తున్న క్రమంలో కోమటిరెడ్డి భిన్నంగా స్పందించారు.

తన పార్లమెంటరీ నియోజకవర్గంలో పెండింగ్‌లో పలు అభివృద్ధి పనులు పూర్తి చేస్తే తాను, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పదవులకు రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు వెంకట్‌రెడ్డి. తన నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇస్తే తాను రాజకీయాల్లో ఉండబోనని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఇకపోతే నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మంచి పట్టున్న నేతలుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు. జిల్లా నుంచి సీనియర్ నేతలు రాజకీయాల్లో ఉన్నప్పటకీ తమ ప్రాభవాన్ని కాపాడుకుంటూ వచ్చారు వీరు. జిల్లాలో పోటీ ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్యే ఉండటం ఏళ్ల నుంచి గమనించొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version