ఇంటి మధ్యలో దేశ సరిహద్దు.. ఆ రేర్‌హౌజ్.. ఎక్కడుందంటే?

-

సాధారణంగా దేశ సరిహద్దు అనగానే పొడవాటి ముళ్ల తీగలతో కంచెలు, అటు ఇటు రెండు దేశాల సైనికుల పహారా ఉంటుందని అందరికీ తెలుసు. అయితే, సరిహద్దులో ఓ ఇల్లు ఉంటే ఎలా? అనుమానం ఎప్పుడైనా మీకు వచ్చిందా? లేదండీ..సరిహద్దులో ఇల్లు ఉండే అవకాశమే లేదని మీరు పేర్కొంటే.. అది తప్పే అవుతుంది. సరిహద్దులోనే ఇల్లు ఉందట. ఆ అరుదైన ఇల్లు ఏ దేశాల బార్డర్ మధ్య ఉందో తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీని రీడ్ చేయాల్సిందే.

భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో ఓ ఇల్లు ఉందండోయ్.. ఈ అరుదైన ఇల్లు మధ్యలో నుంచి బోర్డర్ లైన్ వెళ్లడం విశేషం. ఫలితంగా ఆ ఇంటిపైన ఫెన్సింగ్ లేదు. సదరు ఇంటికి సంబంధించిన 385 గజాల స్థలానికి కంచె లేదు. ఇకపోతే ఈ రేర్ హౌజ్‌కు ఒకవైపు ఇండియా, మరోవైపు బంగ్లాదేశ్ ఉండటం విశేషం. ఈ ఇంట్లో రెండు దేశాల వారూ ఉండటంతో పాటు వారి మధ్య ఎలాంటి గొడవలు ఉండబోవట. పూర్తి స్నేహపూర్వకంగా వీరు కలిసి మెలిసి ఉంటారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉండే బోర్డర్ లైన్‌ను ‘జీరో లైన్’ అని పిలుస్తుంటారు. ఈ ఇల్లు ఏ రాష్ట్రంలో ఉందంటే..పశ్చిమ బెంగాల్‌లోని హరి పుకుర్‌లో సరిహద్దులో ఉంది. ఈ హౌజ్ వాల్‌కు ఓవైపు ఇండియా అని రాసి ఉండగా, మరోవైపు బంగ్లాదేశ్ అని రాసి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇంటికి రెండు నేషన్స్ సెక్యురిటీ ఉండటం విశేషం.

రెండు దేశాల సైనికులు ఈ ఇంటిని పహారా కాస్తుంటారు. ఇండియాకు చెందిన బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ ఇండియా వైపున్న హౌజ్ పార్ట్‌కు సెక్యురిటీగా ఉంటుంది. బంగ్లాదేశ్ వైపున్న ఇంటికి సెక్యురిటీగా బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ సైనికులు భద్రతా వలయంగా ఉంటారు. ఈ ఇంట్లో ఉండే వారు కుల, మతాలకు అతీతంగా జీవిస్తుండటం ప్రత్యేకం.

Read more RELATED
Recommended to you

Exit mobile version