అన్న పోరాటానికి తమ్ముడి మద్దతు కరువైందా..కొమటిరెడ్డి బ్రదర్స్ పై ఆసక్తికర చర్చ

-

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్టయిల్‌ డిఫరెంట్‌. అసెంబ్లీ సమావేశాలు వచ్చాయంటే కనిపిస్తారు. ఆ తర్వాత ఆయన దారి ఆయనది. కొత్త ఇంఛార్జ్‌ వచ్చినప్పుడు కనిపించలేదు. ఇప్పుడు పీసీసీ చీఫ్‌ ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ జరిగినా.. గాంధీభవన్ మెట్లెక్కలేదు. పీసీసీ చీఫ్ పదవికోసం అన్న పెద్దపోరటమే చేస్తుంటే తమ్ముడు ఎందుకు సైలెంట్ అయ్యారు…

ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉంటే కాంగ్రెస్‌ పని అంతే.. కొత్త సారథి కావాలి.. అప్పుడే పార్టీ బాగుపడుతుంది అని అప్పట్లో సంచలన కామెంట్స్‌ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఆ సమయంలోనే ఆయన బీజేపీలోకి వెళ్తున్నట్టు ప్రచారం జరిగింది. కార్యకర్తల భేటీ కూడా నిర్వహించారు. అయితే కేడర్‌ ఒప్పుకోలేదని సమాచారం. ఇంతలో బీజేపీలో తానే సీఎం క్యాండిడేట్‌ అని రాజగోపాల్‌రెడ్డి ఆడియో ఒకటి లీక్‌ కావడంతో సీన్‌ రివర్స్‌ అయింది. ఇప్పటికైతే హస్తం గూటిలోనే ఉన్నారు. మరి.. ఆయన బీజేపీలోకి వెళ్తారో.. కాంగ్రెస్‌లోనే ఉంటారో అర్థం కాని పరిస్థితి.

ఆ తరవాత బీజేపీ లోకి వెళ్తున్నట్టు కార్యకర్తల తో సమావేశం అయ్యారు. కార్యకర్తలు అభ్యంతరం చెప్పడంతో…ఇంతలో బీజేపీ లో నేనే సీఎం క్యాండేట్ అని ఓ ఆడియో లీక్ కావడంతో సీన్ రివర్స్ అయ్యింది. బీజేపీ లోకి వెళ్తారా.. కాంగ్రెస్ లోనే ఉంటారో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైతే కాంగ్రెస్ లో ఉన్నట్టే…మరి కాంగ్రెస్ లోనే ఉంటే… నాయకత్వ మార్పు కోరుకునే రాజగోపాల్ రెడ్డి… గాంధీ భవన్ లో జరుగుతున్న అభిప్రాయ సేకరణకు ఎందుకు రాలేదు…

సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి పీసీసీ ఇవ్వాలని సీఎల్పీలో ఉన్న జగ్గారెడ్డి..శ్రీధర్ బాబు..పొడెం వీరయ్య..లాంటి వాళ్లంతా ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవడం… ఠాగూర్ దగ్గర పంచాయితీకి దిగారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం అటు వైపు కూడా వెళ్ళలేదు. దీనికి తోడు కనీసం ఓ ప్రకటన కూడా చేయలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే బ్రాండ్… అలాంటిది ఇద్దరు అన్నదమ్ములు ఒకరి కోసం ఇంకొకరు సహకరించుకోవాల్సింది పోయి… ఇలా ఎవరి దారి వారు వెతుక్కుంటున్నారా..? అనే అనవసర చర్చకు కారణం అయ్యింది. అయితే అభిప్రాయ సేకరణలో ఠాగూర్ కి… ఫోన్ చేసి అభిప్రాయం చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోసం పార్టీలోని కొందరు నాయకులు కొట్లాడుతుంటే… సొంత సోదరుడు రాజగోపాల్ రెడ్డి మౌనంగా ఉండటం ఎలాంటి సంకేతాలు పంపుతుంది అనేదే ఇప్పుడు హాట్ టాపిక్. అందుకే… ఆయన ఎవరికి అర్థం కావడం లేదా..లేదంటే రాజగోపాల్ రెడ్డి కన్ఫ్యూజన్ లో ఉన్నారో ఎవరికి అంతు చిక్కడం లేదు. ఆయన రూట్ సెపరేట్ అంటూ కాంగ్రెస్ నాయకులు నిట్టూర్పులు విడుస్తున్నారు…

Read more RELATED
Recommended to you

Exit mobile version