కోన’సీమ’: బాబు అదే పనిలో ఉన్నారా?

-

కోనసీమ ప్రాంతం అంటే ప్రశాంతతకు మారు పేరు…ఇక్కడ వాతావరణం లాగానే…ప్రజలు కూడా నిదానంగా ఉంటారు..ఇక్కడ పెద్ద పెద్ద గొడవలు ఏమి జరగవు. కానీ తాజాగా జరిగిన ఆందోళన కార్యక్రమం..కోనసీమలో మంటలు లేపింది. ఊహించని విధంగా జిల్లా పేరు అంశం పెద్ద రచ్చకు తెరతీసింది. ఇటీవల జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాలని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమలాపురం ప్రాంతానికి కోనసీమ జిల్లాగా పేరు పెట్టారు.

అంటే అమలాపురం పార్లమెంట్ మొత్తం కోనసీమ జిల్లాగా ఉంటుంది. అయితే ఇటీవల జిల్లాకు అంబేడ్కర్ పేరుని పెట్టారు. ఇక ఇక్కడ నుంచే అసలు రచ్చ తెరపైకి వచ్చింది. అనూహ్యంగా జిల్లా పేరు మార్చవద్దని , కోనసీమ పేరు మాత్రమే ఉంచాలని చెప్పి..అమలాపురం ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ఆందోళన కాస్త భారీ విధ్వంసం దిశగా వెళ్లింది..మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యేల ఇళ్లని తగలబెట్టేవరకు వెళ్లింది. అలాగే పార్టీ ఆఫీసులకు నిప్పు అంటించారు. ఇలా ఆందోళన కార్యక్రమం పూర్తిగా గాడి తప్పింది.

అయితే ఈ రచ్చ వెనుక ప్రతిపక్ష టీడీపీ ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఈ రచ్చ సృష్టించిందే వైసీపీ అని టీడీపీ నేతలు అంటున్నారు. ఇలా రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..ఈ రచ్చకు కారణం చంద్రబాబు అని చెప్పుకొచ్చారు. దావోస్ సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనే ఉద్దేశంతోనే కోనసీమలో చంద్రబాబు గ్యాంగ్ విధ్వంసకాండకు పాల్పడిందని, అంబేద్కర్ ను అవమానిస్తే జాతి క్షమించదని, రాజకీయంగా పుట్టగతులు లేకుండా పోతారని బాబుపై విజయసాయి మండిపడ్డారు.

అసలు ఇక్కడ కోనసీమలో జరిగిన గొడవలకు చంద్రబాబుకు సంబంధం ఏంటో క్లారిటీ లేదు…కానీ విజయసాయి మాత్రం క్లారిటీ ఇచ్చేస్తున్నారు. మొదట జిల్లాల విభజన చేసి కోనసీమ పేరు పెట్టింది వైసీపీ ప్రభుత్వమే..ఇప్పుడు పేరు మార్చి అంబేడ్కర్ పేరు పెట్టింది వైసీపీ ప్రభుత్వమే..అక్కడ జిల్లా పేరు కోసం ప్రజలు ఆందోళనలు చేశారు..దీంట్లో బాబు ప్రమేయం ఏంటో ఎవరికి అర్ధం కాని విషయం…కానీ విజయసాయి మాత్రం…అన్నిటికి బాబుని లాగాలి కాబట్టి…ఇంకా బాబుపై విమర్శలు చేసినట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version