కోనసీమ అల్లర్లలో కీలక నిందితుడి అరెస్ట్

-

అంబేద్కర్ జిల్లా అని పేరు పెట్టడంతో కోనసీమ అట్టుడుకుతోంది. పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. కోనసీమ జిల్లా పేరును మార్చవద్దని కొంతమంది పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు. పరిస్థితి చేజారిపోవడంతో కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇదిలా ఉంటే కోనసీమ జిల్లా అమలాపురం అల్లర్లలో కీలక నిందితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. 

కోనసీమ జిల్లా పేరు మార్చవద్దని అల్లర్లకు కారణమైన అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అన్నెంసాయిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా కోనసీమ జిల్లా పేరు మార్చవద్దని అన్యం సాయి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. కాగా అన్యం సాయిపై రౌడీ షీట్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. అన్యం సాయి అనే వ్యక్తి మంత్రి విశ్వరూప్ అనుచరుడిగా చెబుతున్నారు. వైసీపీ కార్యకర్తగా ఉన్నాడు. నిన్న జరిగిన విధ్వంసంలో అన్యం సాయి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరాలు పరిశీలించి పోలీసులు 40కి పైగా మందిని అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version