తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. బీజేపీలోకి కీలక నేత

-

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలోకి చేరనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న కొండా విశ్వేశ్వరరెడ్డి కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ క్రీయాశీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే.. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో నియంతపాలన సాగుతోందని.. కేసీఆర్‌ తెలంగాణ వాదులను మోసం చేశారన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ జాతీయస్థాయిలో బలహీన పడిందని.. కానీ తెలంగాణలో కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం ఉందన్నారు.

కానీ.. కేసీఆర్‌కు కరెక్ట్‌ పోటీ బీజేపీనేనని.. అందుకే బీజేపీలోకి వెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు. కేసీఆర్‌ పాలనతో తెలంగాణ ఎంతో నష్టపోయిందన్న కొండా విశ్వేశ్వరరెడ్డి.. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం ఒక్కటే బాగుపడిందన్నారు. యాంటి కేసీఆర్‌ ఓటు బీజేపీకే వెళ్తుందని స్పష్టం చేశారు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి. కాంగ్రెస్ కి అంత శక్తి లేదని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, నేను బీజేపీలో చేరుతున్నానని ఆయన వెల్లడించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏ రోజు నన్ను చేరమంటే ఆ రోజు చేరుతానని కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version