KondaPolam Movie: కొండపొలం సీక్రెట్స్ చెప్పేసిన మెగా అల్లుడు వైష్ణ‌వ్! ఆ సీనే మూవీకి హైలెట్!

-

KondaPolam Movie: మెగా అల్లుడు, యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ లు జంట‌గా న‌టిస్తున్న చిత్రం కొండపొలం. ప్ర‌ముఖ నవ‌ల కొండ‌పొలం ఆధారంగా .. టాలీవుడ్ సెన్సెష‌న‌ల్ డైరెక్ట‌ర్ క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా.. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమ‌వుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 8న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో భారీ అంచనాలు నెల‌కొన్నాయి. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.

ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా హీరో వైష్ణవ్ తేజ్ ప‌లు ఇంటర్వ్యూలు పాల్గొంటున్నారు. అప్పుడప్పుడు సినిమాలోని ప‌లు సీక్రెట్స్ ను బ‌య‌ట పెడుతూ.. సినిమా మీద హైప్ ను క్రియేట్ చేస్తున్నారు. కొండపొలం అంటే ఊరిలో కరువు వస్తే గొర్రెలు తీసుకొని అడవికి వెళ్లి బ్రతకడమ‌ని,తాత చెప్పే మాటలను విని తాను కొండపొలానికి వెళతానని వైష్ణవ్ తెలిపారు. ఈ చిత్రంలో తాను కడప యాసలో కనిపిస్తానని తెలిపారు.

అలాగే మ‌రో ఇంట్రెస్టింగ్ పాయింట్ వెల్ల‌డించారు. ఈ సినిమాలో పులితో ఫైట్ ఉంటుందని, ఈ సీన్ సినిమాకే హైలెట్ అవుతుంద‌ని తెలిపారు. అలాగే యాక్ష‌న్ సీన్స్ అదుర్స్ అని.. ఫైట్ మాస్టర్ వెంకట్ యాక్షన్ సీక్వెన్స్ లను చేయించారని వైష్ణవ్ పేర్కొన్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ తో చాలా రొమాంటిక్ సీన్లు ఉన్నాయ‌నీ, ఆమె న‌ట‌న అద్భుత‌మ‌ని ప్రసంశించారు. క్రిష్ డైరెక్ష‌న్ చాలా బాగుంద‌ని, విభిన్నమైన కథలను ఎంచుకోవడం గురించి స్పందిస్తూ తనకు కొత్త పాత్ర ఇస్తున్నందుకు థ్యాంక్స్ తెలిపారు.

తాను తొలుత ఈ క‌థ విన్న త‌ర్వ‌త పవన్ కళ్యాణ్ కు చెబితే.. క‌థ చాలా బాగుంది, నటించమని చెప్పారని వైష్ణవ్ తెలిపారు. భారీగా అంచనాల మ‌ధ్య విడుద‌ల‌వుతున్న‌కొండపొలం సినిమా .. ఉప్పెన సినిమాలా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమో చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version