చైసామ్ విడాకులు..సిద్ధార్థ్ కు సపోర్ట్ గా పూనమ్ కౌర్..!

-

నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇక విడాకుల అంశంపై పలువురు ఆసక్తికరంగా స్పందించారు. చైతు విడాకులపై నాగార్జున ఎమోషనల్ అయ్యారు. సమంత పై తమ కుటుంబానికి ఉన్న అభిమానాన్ని నాగార్జున తన పోస్టులో చాటుకున్నారు. సమంత తమ కుటుంబం తో గడిపిన క్షణాలు మర్చిపోలేము అని నాగ్ పేర్కొన్నారు. ఇక సామ్ చైతు విడాకులు తీసుకున్న కొద్దిసేపటికి హీరో సిద్ధార్థ చేసిన ట్వీట్ కూడా ఒకటి వైరల్ అయింది.

ఈ ట్వీట్ లో సిద్ధార్థ్ …మోసం చేసే వాళ్ళు ఎప్పుడు బాగుపడరని ఈ విషయాన్ని నేను చిన్నప్పుడే మొదట స్కూల్లో నేర్చుకున్నానని పేర్కొన్నారు. మీరు మొదట స్కూల్లో ఏం నేర్చుకున్నారు..? అంటూ సిద్ధార్థ్ ప్రశ్నించారు. అదే ట్వీట్ ను షేర్ చేసిన పూనమ్ కౌర్ నిజమే సిద్ధార్థ్ అంటూ క్యాప్టన్ ఇచ్చింది. అలా పూనమ్ సిద్ధార్థ్ ను సపోర్ట్ చేసింది. అయితే ఈ ట్వీట్ సిద్ధార్థ-సమంత ను ఉద్దేశించి చేశారని నెటిజన్లు అనుకుంటున్నారు. సిద్ధార్థ్ చేసిన ట్వీట్ కింద సమంత ను ఉద్దేశించే సిద్దు ట్వీట్ చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version