మూడు గంటల కరెంటు కావాలా? మూడు పంటల కరెంట్‌ కావాలా : కొప్పుల ఈశ్వర్‌

-

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లిలో రూ.2.30 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి కొప్పుల
శంకుస్థాపన చేశారు. ఈ సంద్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. మూడు గంటల కరెంటు కావాలా? మూడు పంటల కరెంట్‌ కావాలా తేల్చుకోవాలని ప్రజలకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు అవసరం లేదు.. మూడు గంటల కరెంట్‌ సరిపోతుందని అనడం తెలంగాణ రైతాంగాన్ని అగాధంలోకి నెట్టినట్లేనని అన్నారు కొప్పుల ఈశ్వర్‌. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే మూడు గంటల కరెంట్‌కు ఒప్పుకున్నట్లేనని మంత్రి కొప్పుల అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు, పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డికి రైతులు తగిన గుణపాఠం చెప్పాలని కొప్పుల ఈశ్వర్‌ పిలుపునిచ్చారు.

50 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ ఏ అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు కొప్పుల ఈశ్వర్‌. కాంగ్రెస్‌ అభివృద్ధి పార్టీ కాదని.. పైరవీల పార్టీ అని మంత్రి ఎద్దేవా చేశారు. మన సీఎం కేసీఆర్‌ అడగకుండానే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version