టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ..రైటర్ గా ఇండస్ట్రీలో విజయవంతమైన సినిమాలకు స్టోరిలు అందించారు. ‘మిర్చి’ చిత్రంతో దర్శకుడిగా మారిన ఈయన..దర్శకుడిగా చేసిన సినిమాలు ‘ఆచార్య’తో కలుపుకుని ఐదు సినిమాలు. కాగా, ఈ ఐదు పిక్చర్స్ లోనూ సామాజిక సందేశంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటం విశేషం.
ఈ నెల 29న విడుదల కానున్న ‘ఆచార్య’ చిత్రంలోనూ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సొసైటీకి యూస్ ఫుల్ మెసేజ్ ను కొరటాల శివ ఇవ్వబోతున్నారని మంగళవారం విడుదలైన ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.
‘ధర్మస్థలి’ని కాపాడటం కోసం ‘సిద్ధ’ను కామ్రేడ్ గా ‘ఆచార్య’ ఎలా మార్చాడు? ‘ధర్మస్థలి’ని కాపాడటం కోసం, అధర్మస్థలిగా మారకుండా ఉండటం కోసం కామ్రేడ్స్ గా చిరంజీవి, రామ్ చరణ్ ల సాయుధ పోరాటం చిత్రంలో ఆసక్తికరంగా ఉండబోతున్నదని ట్రైలర్ ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది.
ఇక చిత్రంలో తండ్రీ తనయులు చిరంజీవి, రామ్ చరణ్ లకు సెపరేట్ డ్యాన్స్ నెంబర్ తో పాటు, స్పెషల్ సాంగ్ ఎక్సలెంట్ గా ఉండబోతున్నది. సినిమాను మెగా అభిమానులు కన్నుల పండువగా సెలబ్రేట్ చేసుకోనున్నారు.
రామ్ చరణ్ – పూజా హెగ్డేల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎక్సలెంట్ గా ఉండబోతున్నదని స్పష్టమవుతోంది. మెలోడీ బ్రహ్మా మ్యూజిక్ ఆద్యంతం ఆకట్టుకోనుంది. ఇక యాక్షన్ సీక్వెన్సెస్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుండగా, బీజీఎం అదరగొట్టినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. మొత్తంగా ఈ నెల 29న మెగా మాస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయని అభిమానులు అంటున్నారు.