కంగారుపడుతున్న కొరటాల శివ .. అందుకేనా ..?

-

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కరోనా కారణంగా నిలిపివేసిన సంగతి తెలిసందే. ఇక ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ లేకుండా సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా మంచి ఫాం లో ఉన్న కొరటాల చిరంజీవి కాంబినేషన్ లో సినిమా అనగానే ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోను భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాని కూడా పాన్ ఇండియా కేటగిరీలోనే నిర్మిస్తున్నారు.

 

అయితే ఇప్పటికే ఈ సినిమా కోసం కొరటాల రెండేళ్ళుగా వేరే ఏ సినిమా కమిటవకుండా ఆగాడు. అది ఒకరకంగా మైనస్ అయినా ఒకరకంగా పెద్ద ప్లస్ అని భావిస్తున్నారు. అందుకు కారణం మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే అవకాశం రావడమే. అందుకే మరో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు కూడా పక్కన పెట్టి చిరంజీవి కోసమే వేయిట్ చేశారు. ఇవన్ని ఆయని ఏమాత్రం టెన్షన్ పెట్టనప్పటికి కరోనా కారణంగా మొత్తం ప్లాన్ మారిపోయింది. దీంతో ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలలోను కొరటాల కంగారు పడుతున్నారట.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు 40 శాతం మాత్రమే పూర్తి అవడం ఒక కారణమైతే అనుకోకుండా మెగాస్టార్ ఈ సినిమా టైటిల్ రివీల్ చేయడం కాస్త కొరటాల డిసప్పాయింట్ అయ్యారట. అంతేకాదు రీసెంట్ గా ఈ సినిమా కథ ఏంటనేది చిరంజీవి క్లూ ఇచ్చారు. వాస్తవంగా కొరటాల ఇప్పటి వరకు తీసిన సినిమాలేవీ కూడా రిలీజ్ కి ముందు కథ ఏంటనేది రివీల్ చేయకుండా సీక్రెట్ మేయిన్‌టైన్ చేశారు. కాని ఈ సారి మాత్రం అలా కుదరడం లేదు. ఏదో రకంగా ఆచార్య సినిమాకి సంబంధించి ఒక్కొక్కటిగా లీకవుతున్నాయి. దీంతో ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఇప్పటి నుంచే లోలోపల కంగారు పడుతున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version