చావు తధ్యం అయినప్పుడు ‘కరోనా’ తో పనిలేదు అని నిరూపించిన ఘటన !

-

ప్రపంచంలో ప్రస్తుతం కరోనా వైరస్ తప్ప వేరే వార్తలేమి వినపడటం లేదు. ఎక్కడ చూసినా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరియు అదే విధంగా కరోనా మరణాలు గురించే వార్తలు వస్తున్నాయి. అయినా గానీ చాలామంది వైద్యులు ఈ వైరస్ బారిన పడిన వారిని రక్షించడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం గట్టిగానే ఉంది. కాని భారతదేశంలో మాత్రం ముందు నుంచి కొద్దిగా నార్మల్ గానే ఉంది.దానికి కారణం చూస్తే ప్రభుత్వం ముందుగానే లాక్ డౌన్ అమలు చేయటం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలావరకు ప్రపంచవ్యాప్తంగా చావులు ఎక్కువగా కరోనా వైరస్ వల్ల సంభవిస్తున్నాయి. ఇటువంటి క్లిష్టమైన సమయంలో చావు తధ్యం అయినప్పుడు ‘కరోనా’ తో పనిలేదు అని ఓ సంఘటన నిరూపించింది. తమిళనాడు రాష్ట్రం లో జిల్లాలో గిరిజన గ్రామంలో ఓ ప్రభుత్వ వైద్యుడు విధులు నిర్వహిస్తున్నారు.

 

కరోనా వైరస్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ వైద్యుడికి ఒక్కసారిగా ఇటీవల అధిక జ్వరం వచ్చింది. దీంతో వెంటనే ‘కరోనా’ అని అనుమానించిన వైద్యులు హుటాహుటిన నీలగిరి జిల్లా లోని  ఆసుపత్రికి తరలించారు. అక్కడ కరోనా వైరస్ పరీక్షలు చేయగా నెగిటివ్ ఫలితం వచ్చింది. దీంతో వైద్యులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత వెంటనే సదరు ప్రభుత్వ వైద్యుడిని ప్రైవేట్ ఆస్పత్రిలో తరలించారు. అయితే ఈ సమయంలో చికిత్స తీసుకుంటూ సదరు వైద్యుడు మరణించడం జరిగింది. ఈ ఘటన చూసి డాక్టర్ లందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. తీరా తర్వాత వచ్చిన రిపోర్టులు చూస్తే సదరు వైద్యుడికి డెంగ్యూ రావటంతో చావు వచ్చిందని వైద్యులు తెలుసుకున్నారు. దీంతో చావు టైం వస్తే కరోనా వైరస్ తో పనిలేదని ఈ సంఘటన చూసి చాలామంది అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version