అనసూయ చిట్టి పొట్టి బట్టలపై కోటా షాకింగ్ కామెంట్స్..!

-

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాంకర్ మాట్లాడుతూ… ఆహనా పెళ్ళంట సినిమా ఎంతో భాగుంటుందని…ఆ సినిమాలో కోటా శ్రీనివాస్ నటనపై ప్రశంసలు కురిపించారు. సినిమాలో కామెడీ చాలా బాగుంటుందని అన్నారు. అయితే అలాంటి సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయని కోట శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు. దాంతో ప్రస్తుతం జబర్దస్త్ అనే ఒక టివి షో వస్తుందని దానిపై మీద అభిప్రాయం ఏంటి అని యాంకర్ అడిగారు. అయితే అలాంటి షోలు ఎల్లకాలం ఉండవని ఏదో నడుస్తుందని కోట శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు.

అది స్టాండప్ కామెడీ కూడా కాదని అన్నారు. ఎదో నాలుగు డైలాగులు…బట్టలు వేసుకోవడం తప్ప అని అన్నారు. జబర్దస్త్ షో యాంకర్ అనసూయ దుస్తులపై కోటా షాకింగ్ కామెంట్లు చేశారు. అనసూయ ఎంతో అందంగా ఉంటుందని కానీ అలాంటి బట్టలను వేసుకోవడం ఎందుకని వ్యాఖ్యానించారు. చాలా బాగా నటిస్తుందని చాలా అందంగా ఉంటుందని అన్నారు. అనసూయ ఎలా వచ్చినా చూస్తారని అన్నారు. రోజా చక్కగా రెడీ అవుతుందని అయినా కూడా షో చూడటం లేదా అని కోటా వ్యాఖ్యానించారు. అంతే కాకుండా కోటా శ్రీనివాస్ రావు తనపై నాగబాబు చేసిన వ్యాఖ్యలపై కూడా మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news