సీఎం జగన్ అమరావతికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, దాంతో పాటు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చూస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తున్నారని, కానీ ప్రతిపక్షాలు అమరావతే ముద్దు మిగతా ప్రాంతాలు వద్దు అంటాయా? చెప్పాలన్నారు కొట్టు సత్యనారాయణ. ముఖ్యమంత్రి సంక్షేమంతో పాటు ప్రాంతాల వారీగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారన్నారు. ఇది ఎన్నికల్లో కీలక అంశంగా మారుతుందన్నారు. ఒక ప్రాంతానికి ప్రాధాన్యం అని కాకుండా మూడు రాజధానులు తెచ్చారన్నారు కొట్టు సత్యనారాయణ.
విపక్షాలు అమరావతి ఒకటే రాజధాని అంటారా? ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు సమాధానం చెప్పాలని కొట్టు సత్యనారాయణ నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్ అమరావతికి వ్యతిరేకం కాదని, అమరావతిని శాసన రాజధానిగానే ఉంచి ఇక్కడ అభివృద్ధి చేయాలనుకుంటున్నారన్నారు. అందుకే ఆయన అమరావతిలోనే ఇళ్లు కట్టుకొని అమరావతి మీద అభిమానం చాటుకున్నారని చెప్పారు. శాసన రాజధానిగా అమరావతికి జగన్ అత్యంత ప్రాధాన్యమిచ్చి అభివృద్ధి చేస్తారన్నారు. ప్రతిపక్షాలు అమరావతే ముద్దు మిగతా ప్రాంతాలు వద్దు అని చెబుతున్నాయా? వారు ఉత్తరాంధ్ర రాయలసీమ వెళ్లినప్పుడు ఏం సమాధానం చెబుతారని కొట్టు సత్యనారాయణ నిలదీశారు.