ఈ రోజు ఉదయం హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నా అక్కడక్కడా టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. తాజాగా ఘన్ముక్లలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తన సొంత మండలం లో పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి రావడంతో గర్షణ వాతావరణం నెలకొంది. తెరాస శ్రేణులతో కలిసి మరోసారి కౌశిక్‌రెడ్డి ఘన్ముక్ల గ్రామానికి వచ్చారు. దాంతో పోలింగ్ భూత్ వద్ద కౌశిక్‌రెడ్డిని భాజపా శ్రేణులు నిలదీశారు. ఘన్ముక్లకు మళ్లీ మళ్లీ ఎందుకు వస్తున్నారంటూ భాజపా శ్రేణులు కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కౌశిక్‌రెడ్డి దౌర్జన్యానికి యత్నిస్తున్నారంటూ భాజపా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దాంతో తాను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌నంటూ కౌశిక్‌రెడ్డి ఐడీ కార్డును చూపించారు. ఈ సంధర్బంగా కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా పోలింగ్ కేంద్రానికి వెళ్లానని ఆయన చెబుతున్నారు. అంతే కాకుండా ఈటెల వర్గీయులు సానుభూతి కోసం యత్నిస్తున్నారని కౌశిక్ రెడ్డి అన్నారు. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా వెళ్లేందుకు తనకు హక్కు ఉందని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.