కొవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ ఇక ప్రాంతీయ భాష‌ల్లోనే.. కేంద్రం కీల‌క నిర్ణ‌యం

-

ఇప్ప‌డు దేశ‌వ్యాప్తంగా కొవిడ్ ఎఫెక్ట్ చాలా దారుణంగా ఉంది. దీన్ని ఎదుర్కోవాలంటే వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే మార్గం. కానీ మ‌న దేశంలో వ్యాక్సిన్ల కొర‌త మొన్న‌టి వ‌ర‌కు తీవ్ర స్థాయిలో ఉండేది. కానీ జూన్‌లో 12కోట్ల వ్యాక్సినేష‌న్ చేప‌డుతామ‌ని కేంద్ర ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ కోసం కొవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ (Covid Vaccine Registration) చేసుకునే ప‌ద్ధ‌తిని కేంద్రం సుల‌భ‌త‌రం చేసింది.

 

అంద‌రికీ ఇంగ్లిష్ రాదు కాబ‌ట్టి ఏ రాష్ట్రం వారు ఆ ప్రాంతీయ భాష‌ల్లో కొవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ చేసుకునే వెస‌లు బాటును క‌ల్పిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. ఇప్పుడు హిందీతో సహా 10 ప్రాంతీయ భాషల్లోకి కొవిన్ పోర్ట‌ల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

తెలుగు, మరాఠీ, మలయాళం, పంజాబీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, ఒడియా భాషల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా మార్పులు చేంది కేంద్ర ప్ర‌భుత్వం. ఇక 18ఏళ్లు దాటిన వారు కరోనా టీకా పొందాలంటే కొవిన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు హిందీ లేదా ఇంగ్లిష్‌లో ఉండే కొవిన్ పోర్ట‌ల్ ఇప్పుడు మ‌న వ‌ద్ద తెలుగులో కూడా క‌నిపించ‌నుంది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 22కోట్ల మందికిపైగా టీకాలు వేసింది కేంద్రం.

Read more RELATED
Recommended to you

Exit mobile version