నెల్లూరు జిల్లాలో రాజకీయాలు గత ఆరు నెలల నుండి చాలా హాట్ హాట్ గా ఉన్నాయి. వరుసగా ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా మారడంతో జిల్లాలో కాస్త ఆందోళన క్రమంగా వైసీపీ పరిస్థితి ఉంది. దీనితో జిల్లా ప్రజలలో నిరుత్సాహం కలగకుండా మిగిలిన ఎమ్మెల్యేలు ఆ బాధ్యతను తమ భుజాన వేసుకున్నారు. అందులో భాగంగా కాసేపటి క్రితం కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ డైరెక్ట్ రాజకీయాలు చేయడని… నిరంతరం తన రాజకీయ రంగులను మారుస్తూ ఊసరవెల్లి రాజకీయాలను చేస్తాడని అన్నారు.
KOVURU MLA: బాబోరిది “ఊసరవెల్లి” రాజకీయం… మరో 20 యేళ్లు జగనే సీఎం!
-