టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు. చిరంజీవి తమ్ముడిగా సినిమా రంగంలో అడుగుపెట్టి ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో అందరికీ తెలిసినదే. వరుస ఫ్లాపులు వచ్చినా తన కెరియర్ గ్రాఫ్ ఏమాత్రం తగ్గకుండా హిట్ కి ప్లాప్ కి సంబంధం లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలారు. మొన్నటి వరకు రాజకీయాల్లో ఫుల్ బిజీ కావడంతో రెండు సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరమైన పవన్ కళ్యాణ్ ఇటీవల రీ ఎంట్రీ ఇవ్వడం మనకందరికీ తెలిసినదే.
మొఘలుల కాలం నాటి సమయంలో జరిగిన ఒక సంఘటన నీ ఆధారం చేసుకుని డైమండ్ చుట్టూ సినిమా స్టోరీ ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నరు క్రిష్. కాగా తుగ్లక్‌కి సంబంధించిన ఓ ఎసిసోడ్ ఈ కథలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సెటైరికల్ పంచులు వేసే విధంగా ఇటీవల క్రిష్ స్క్రిప్టు మార్చినట్లు సమాచారం. ఏపీ రాజకీయాల్లో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి పై విమర్శ చేసే విధంగా సన్నివేశం ఉంటుందని టాలీవుడ్ ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్.