Friendship day : ద్వాపరయుగంలో కృష్ణ కుచేలులు స్నేహబంధం అజరామరం

-

రాసులు, కాసులు పోసినా రాదుగా స్నేహం.. కోపం, పంతం నిత్యం సహజం.. ఓదార్పు, ధైర్యం స్నేహంలో.. ప్రేమ, వైరం స్నేహంలో.. Friendship day

Krishna Kuchela Friendship – Freiendship Day

స్నేహం అంటే నిజంగా వర్ణించలేని భావం. నిజంగా పక్కన ఒక స్నేహితుడు ఉంటే ఒక ఆయుధంలాగ ఉంటుంది. ఎన్ని అక్షరాలతో వ్రాసినా, ఎన్ని బహుమతులు ఇచ్చినా స్నేహాన్ని చెప్పలేము, చూపించలేము. అంత గొప్పగా ఉంటుంది స్నేహం మరి..!!

కష్టసుఖాలని చెప్పుకోడానికి, ఆనందాన్ని పంచుకోవడానికి, తెలియనివి అడగడానికి, తన గురించి తాను తెలుసుకోవడానికి, ఎవరికీ చెప్పలేనివి చెప్పుకోవడానికి ఇలా ఎన్నో వాటికి తప్పక స్నేహం అవసరం. నిజంగా స్నేహితుడితో ఏ దాపరికం లేకుండా ఓదార్పుని పొందుతాం. ఎనలేని ఆనందాన్ని పొందుతాం. అయితే స్నేహం అంటే మనకి కొత్తేమి కాదు. అదేమీ నిన్నో, మొన్నో వచ్చినది కాదు. పురాణాల నుండి కూడా మంచి స్నేహాన్ని, స్నేహితులని మనం చూస్తున్నాం.

ద్వాపరయుగంలో స్నేహితులు :

శ్రీకృష్ణ భగవానుడిని ప్రతి ఒక్కరూ ఆరాధిస్తారు. నిజంగా శ్రీ కృష్ణుడు మనసు వెన్న. ద్వాపర యుగం లో అత్యంత నిరుపేద అయిన కుచేలుడు తో శ్రీకృష్ణ భగవానుడు స్నేహం కొనసాగించాడు. కృష్ణుడికి ఇష్టమని అటుకులు తెచ్చిన కుచేలుడికి శ్రీకృష్ణుడు ఏకంగా బంగారు పట్టణాన్ని బహుమతిగా ఇస్తాడు. దీనితో మనం స్నేహం యొక్క విలువని అర్థం చేసుకోగలం. నిజంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకానికి స్నేహం అంటే ఏమిటో తెలియజేశాడు.

శ్రీ‌కృష్ఱుడు కుచేలుడి చెలిమి కూడా కొనియాడ‌ద‌గిన‌దే. వీరిద్ద‌రూ క‌లిసి సాందీప మ‌హ‌ర్షి ఆశ్ర‌మంలో విద్యాభ్యాసం చేస్తారు. అయితే శ్రీ‌కృష్ణుడు యాద‌వ వంశ రాజు క‌నుక త‌మ రాజ్యాన్ని పాలిస్తుంటాడు. మ‌రోవైపు కుచేలుడు పేద‌రికంతో అల‌మ‌టిస్తుంటాడు. అయితే శ్రీ‌కృష్ణుడు త‌న స్నేహితుడైన‌ప్ప‌టికీ త‌న‌ను ఆద‌రిస్తాడా.. అన్న సందేహం కుచేలుడిలో ఉంటుంది. కానీ కుచేలుడు ధైర్యం చేసి త‌న చిన్న‌నాటి స్నేహితుడు కృష్ణుడి వ‌ద్ద‌కు వెళ్తాడు.

Krishna Kuchela

శ్రీకృష్ణుడు కుచేలునితో తనకు ఏమైన తీసుకొని వచ్చావా అని అడుగుతాడు. కుచేలుడు సిగ్గుతో తాను తెచ్చిన అటుకుల మూట దాచుతుంటే శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికి ఆ అటుకులు తింటాడు.  రెండవ మారు మళ్ళీ ఆటుకులు గుప్పెటితో తిన బోతుండగా రుక్మిణి స్వామి మీరు మొదటి సారి అటుకులు తినడంవల్లే కుచేలునికి సర్వసంపదలు కలిగాయి అని చెబుతుంది.

దీంతో కుచేలుడి జీవిత‌మే మారిపోతుంది. అప్ప‌టి వ‌ర‌కు క‌టిక పేద‌రికం అనుభ‌వించిన అత‌ను అష్టైశ్వ‌ర్యాల‌లో మునిగి తేలుతాడు. అదంతా స్నేహితుడైన కృష్ణుడి చ‌లవే. వారిద్ద‌రి మ‌ధ్య అంత గాఢమైన‌ స్నేహం ఉంది కాబ‌ట్టే కృష్ణుడు కుచేలుడికి స‌హాయం చేసి ఆదుకున్నాడు. వీరిద్ద‌రి మైత్రి చాలా అపురూప‌మైంది. ముఖ్యంగా డ‌బ్బే లోక‌మైన నేటి స‌మాజంలో ఇలాంటి స్నేహితులు మ‌న‌కు దాదాపుగా దొర‌క‌ర‌నే చెప్ప‌వ‌చ్చు.

మ‌నం జీవించి ఉన్నంత కాలం మ‌న స్నేహం చిర‌కాలం కొన‌సాగేలా చూసుకోవాలి.. హ్యాప్పీ ఫ్రెండ్‌షిప్ డే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version