రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదిరిన సంగతి తెలిసిందే. జల వివాదం నేపథ్యంలో.. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఇరు రాష్ట్రాల నేతలు. ఈ నేపథ్యంలో తాజాగా రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించేందుకు కృష్ణ నది యాజమాన్య బోర్డు బృందం ఇవాళ పరిశీలించనుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాయలసీమ లిఫ్టు పనులను బృందం పరిశీలించనుంది.
కె ఆర్ ఎం బి టీం లో డి ఎం రాయపూర్ , కన్వీనర్, సభ్యులుగా ఎల్ బిమౌంతంగ్ , డర్పన్ తల్వార్ వున్నారు. నోడల్ అధికారిని నియమించాలని ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శికి కె ఆర్ ఎం బి టీం లేఖ రాసింది. ఇప్పటికే పలుమార్లు కె ఆర్ ఎం బి టీం పర్యటన వాయిదాపడింది. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమంగా నిర్మిస్తుందని, పనులు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కె ఆర్ ఎంబీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ పర్యటన కొనసాగుతోంది.