బీజేపీలో ఉన్నవాళ్లంతా హరిశ్చంద్రుని సోదరులా..? : మంత్రి కేటీఆర్

-

ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరగానే కేసులు ఏమైపోతున్నాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సుజనా చౌదరిపై రూ.6వేల కోట్ల కేసు ఏమైందని అడిగారు. అదానీపై కేసులు ఏమయ్యాయని.. ఆయనపై శ్రీలంక చేసిన ఆరోపణలుకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. సీబీఐ, ఈడీ కేసులు కేవలం ప్రతిపక్షాలపైనే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. బీజేపీలో ఉన్న వాళ్లంతా సత్యహరిశ్చంద్రుని సోదరసోదరీమణులా అని కేటీఆర్ అన్నారు.

‘డబుల్‌ ఇంజిన్‌ సర్కార్ అంటే ఒక ఇంజిన్‌ మోదీ.. మరో ఇంజిన్‌ అదానీ. అదానీకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పాలసీ చేసింది.. స్కామ్‌ అంటే అదీ. అదానీ పోర్ట్‌లో డ్రగ్స్‌ దొరికితే స్కామ్‌ కాదా? ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ను విచారణకు పిలిస్తే దాక్కున్నారు. కర్ణాటకలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని పత్రికలు చెబుతున్నాయి. బీజేపీలో ఉన్నవాళ్లంతా హరిశ్చంద్రుడి సోదర సోదరీమణులా?అదానీపై శ్రీలంక చేసిన ఆరోపణల్లో నిజం లేదని ప్రజల ముందుకొచ్చి చెప్పగలరా?’’ అని కేటీఆర్‌ నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version