జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం, రెడీగా ఉండండి :కేటీఆర్ కీలక ఆదేశాలు

-

మంత్రులు, ఎమ్మెల్యేలతో తెలంగాణా భవన్ లో కేటీఆర్ సమావేశం ముగిసింది.  ఈ సంధర్భంగాఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.  ఈనెల ఎనిమిదో తేదీన భారత్ బంద్ విజయవంతం చేయాలని, తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా గల్లి గల్లి బందు కావాలని ఆయన ఆదేశించారు. కార్పోరేటర్లు, ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకొని హైదరాబాద్ బందును విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ప్రతి కార్యకర్త  భారత్ బంద్ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేయాలని ఢిల్లీ పెద్దల దిమ్మతిరిగేలా తెలంగాణ బంద్  విజయవంతం కావాలని అన్నారు.

కొత్తగా గెలిచిన వారు పాత కార్పొరేటర్లందరూ బంద్ లో పాల్గొనాలని కేటీఆర్ ఆదేశించారు. జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ఆయన  కేంద్రం ఆ విషయం లో ముందుకు వెళ్తుంది కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి…జమిలి కి సిద్ధం అయి ఉండాలని ఆయన ఆదేశించారు. గ్రేటర్ ఎన్నికలను మనం అనుభవం గా చూడాలని  ఓడిపోయిన వాళ్ళను చులకనగా చూడద్దు..ఆ డివిజన్ల లో వాళ్ళే మనకు ముఖ్యమని అన్నారు. గ్రేటర్ లో ఈసారి ఎమోషనల్ ఎన్నికలు జరిగాయని, సిట్టింగులకే టిక్కెట్లు ఇచ్చే విషయంలో మనం కొంత ఆలోచించాల్సిందని ఆయన అన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version