పాలమూరుకు ఏం చేశారని మోదీ సభకు వస్తున్నారు : కేటీఆర్‌

-

మరోసారి ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్‌. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరులో అక్టోబరు 1న జరిగే ఎన్నికల శంఖారావ సభకు మోదీ వస్తుండడాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సభ ద్వారా బీజేపీ తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుండగా… పాలమూరులో అడుగుపెట్టే నైతిక హక్కు మోదీకి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

మహబూబ్ నగర్ జిల్లా అంటేనే వలసల జిల్లా అని, దేశంలో ఏ నిర్మాణం జరుగుతున్నా అక్కడ పాలమూరు కూలీలు కనిపిస్తారని ఓ నానుడి ఉందని వివరించారు. భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన మహబూబ్ నగర్ జిల్లాకు మోదీ ఏంచేశారని కేటీఆర్ ప్రశ్నించారు. అసలు, సభ జరపాలని పాలమూరును ఎందుకు ఎంచుకున్నారో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు.

“మహబూబ్ నగర్ జిల్లాకు ఏం చేశారు మీరు? 2014 జూన్ 2న తెలంగాణ వస్తే జులై 14న మా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఓ లేఖ తీసుకుని మీ వద్దకు వచ్చారు. నీటి అంశంలో జరిగిన అన్యాయం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఓ ప్రాతిపదికగా ఉంది… మహబూబ్ నగర్ జిల్లా బాగా వెనుకబడిన జిల్లా… గోదావరి, కృష్ణా జలాల్లో వాటా తేల్చాలి… మీరు ట్రైబ్యునల్ కు సిఫారసు చేస్తే చాలు… మాకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కుతుంది అని మా ముఖ్యమంత్రి మీకు వివరించారు.

ఇది జరిగి తొమ్మిదన్నరేళ్లు అవుతోంది. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం తెలంగాణలో మేజర్ ప్రాజెక్టులు. ఒకటి కృష్ణా నదిపై, మరొకటి గోదావరి నదిపై ఉన్నాయి. ఈ రెండింటిలో ఒక్కదానికైనా జాతీయ హోదా ఇవ్వండి అని ప్రధానిని కోరాం. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే… కరవులు, కన్నీళ్లు, వలసలతో వేదన అనుభవించిన మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంటే ప్రధానమంత్రికి, ఆయన పార్టీకి కన్నుకుడుతోంది. ఓవైపు కృష్ణా జలాల్లో వాటా తేల్చకపోగా, జాతీయ హోదాపై ఒక్క మాట కూడా మాట్లాడరు… కానీ పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్రకు, కెంబెత్వాకు, ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి పాలమూరును మాత్రం పక్కనబెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version