వన్ డే లలో ఫస్ట్ సెంచరీ చేసిన “బెన్ డక్కెట్” .. భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్ !

-

ఇంగ్లాండ్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ వన్ డే లో పరుగులు వర్షం కురుస్తోంది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ ప్లేయర్లు ఐర్లాండ్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నారు, మొదట్లో ఫిలిప్ సాల్ట్ వేగంగాఆ ఆడి హాఫ్ సెంచరీ ని పూర్తి చేసుకున్నాడు.. ఇతను కేవలం 28 బంతుల్లో 7 ఫోర్లు మరియు 4 సిక్సుల సహాయంతో 61 పరుగులు చేసి ఇంగ్లాండ్ కు చక్కని ఆరంభాన్ని అందించారు. ఇతనికి విల్ జాక్స్ (39) నుండి చక్కని సహకారం అందించింది. ఆ తర్వాత క్రాలీ (51) మరియు డక్కెట్ లు మూడవ వికెట్ కు 101 పరుగులు జోడించారు. ఈ క్రమంలో బెన్ డక్కెట్ వన్ డే కెరీర్ లో మొట్టమొదటి సెంచరీ ను పూర్తి చేసుకోవడం విశేషం. ఇతను సరిగ్గా 72 బంతుల్లోనే 100 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో డక్కెట్ 11 ఫోర్లు మరియు 2 సిక్సులు బాదాడు..

ఇతను ఇలాగే ఆడితే ఇంకా ఇన్నింగ్స్ లో 19 ఓవర్లు మిగిలి ఉండగా డబుల్ సెంచరీ సాధించడం పక్కా.. కానీ వర్షం రావడంతో మ్యాచ్ అర్దాంతరంగా నిలిచిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version