కేసీఆర్‌ నన్ను ఐఏఎస్‌ చేయాలనుకున్నారు : కేటీఆర్

-

సీఎం కేసీఆర్ గారు నన్ను ఐఏఎస్ చేయాలనుకున్నారని… కానీ ఆయనకు తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్‌. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ యూనివర్శిటీలో జరుగుతున్న ” కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ” ఓరియంటేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి కెటిఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ వచ్చినప్పుడు చాలా అనుమానాలు ఉన్నాయని…తెలంగాణ లో శాంతి భద్రతలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. దేశంలో ఒక్క తెలంగాణ లోనే ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తున్నామని…ప్రపంచంలో నే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం నిర్మించామని తెలిపారు.

దేశంలోనే అత్యధికముగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ ను కేంద్రమే ప్రకటించిందని… రైతు బంధు కోసం రెండు సీజన్ల లలో కలిపి 62 లక్షలు మంది రైతులకు 15 వేల కోట్లు ఇస్తున్నామని ప్రకటించారు.
రైతుబంధు వచ్చాక తెలంగాణ లో రైతు ఆత్మహత్యలు తగ్గాయని వెల్లడించారు. పార్టీలో కార్యకర్త గా మొదలు పెట్టి నేడు మంత్రిగా పని చేస్తున్నానని.. కేంద్రం గత ఏడాది 20 లక్షలు కోట్ల ప్యాకేజీ అన్నారు అవి ఏమయ్యాయో తెలీదని ఎద్దేవా చేశారు. దళిత కుటుంబాలు కి లాభం చేకూర్చే వరుకు కేసీఆర్ వదిలి పెట్టరని…అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదని తెలిపారు. ఏడేళ్లలో 2. 23 లక్షల కోట్లు పెట్టుబడులు తెలంగాణ రాగా 15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని.. ఇప్పటివరకు 1.39 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version