కాంగ్రెస్ నాయకులు బలిసి కొట్టుకుంటున్నారు: మంత్రి కేటీఆర్

-

ఎన్నికలకు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారంలో ఊపుమీదున్నారు. అందులో భాగంగా BRS మంత్రి కేటీఆర్ ఏ ఈరోజు నల్గొండ జిల్లా చిట్యాలలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిట్యాల రోడ్ షో లో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు టీవీ లలో బలిసి కొట్టుకుంటున్నారు అన్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ కూడా డబ్బు సంచులతో ఎగసి ఎగసి పడుతున్నారు, డబ్బుతోనే ఓట్లను కొని గెలిచే పని అయితే మంచి మానవత్వం ఎందుకంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు అరవై ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉండి చేసింది ఏమీ లేదు, తెలంగాణాలో మూడవసారి కేసీఆర్ సీఎం అయితే పేద ప్రజలు అందరికీ మంచి జరుగుతుంది అంటూ మాట్లాడారు కేటీఆర్.

తెల్ల కార్డు ఉంటే చాలు కేసీఆర్ భీమా, సన్నబియ్యం లాంటి మేము మానిఫెస్టోలో చెప్పైన్ అన్ని హామీలను నెరవేరుస్తాము అంటూ కేటీఆర్ చెప్పాడు. అన్నీ చెప్పిన తర్వాత చిట్యాలలో పోటీ చేస్తున్న చిరుమర్తి లింగయ్యను మీరు తప్పక గెలిపించాలి అంటూ కేటీఆర్ ప్రజలను ఆడిగాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version