ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్ లో పర్యటిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న జానా రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. ఈ మధ్యన జానారెడ్డి కాంగ్రెస్ తెలంగాణాలో అధికారంలోకి వస్తుందని అధిష్టానము ఎందుకో నన్నే సీఎంగా చేస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాన్నీ ఇప్పుడు సీఎం కేసీఆర్ గుర్తు చేస్తూ, నాలుగు సంవత్సరాలలో తెలంగాణలో అంధకారం లేకుండా కరెంట్ ఇస్తే కాంగ్రెస్ నుండి BRS కు వస్తానని మాటిచ్చిన జానారెడ్డి.. ఇప్పుడు మా ప్రభుత్వంలో కేవలం ఏడాదిన్నర లోనే నేను కరెంట్ తీసుకువచ్చాను, అయితే ఇప్పుడు జానారెడ్డి ఇచ్చిన మాటను పక్కన పెట్టి గమ్ముగా ఇంటిలో కూర్చున్నాడు అంటూ సెటైర్లు వేశాడు కేసీఆర్.
ఒక మాటపైనే నిలబడలేని వ్యక్తి సీఎం అవుతానని ఎలా అనుకుంటున్నాడో ఆ దేవుడికే ఎరుక అంటూ కామెంట్స్ చేశాడు సీఎం కేసీఆర్. ఇక మరో రెండు వారాలలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్నది ఊహించేలేని పరిస్థితి.